News

ఘోర రోడ్డు ప్రమాదం


అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మడకశిర నుంచి పెనుకొండ  వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం  మలుపు తిరుగుతూ లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు AP 10 Z 1053.